ఏడాదిలో 10 లక్షల మారుతి కార్ల ఉత్పత్తి

డివిడెండ్ల రూపంలో కంపెనీ రూ.173.35కోట్లు చెల్లించనుంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో పది లక్షల కార్లను అమ్మి భారతీయ కార్ల కంపెనీలలో మారుతీ రికార్డు సృష్టించింది. కంపెనీ 10,18,365కార్లను అమ్మింది. ఇది అంతకుముందు సంవత్సరంకన్నా 28.55శాతం ఎక్కువ. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం మూడింతలు పెరిగి రూ.656.55కోట్లకు చేరింది. 2008-09 నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.243.13కోట్లు నమోదైంది.
గత సంవత్సరం కంపెనీ 1,47,575 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. మారుతీ కార్లను ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, అల్జీరియా, ఇండోనేసియా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొత్తగా దక్షిణాఫ్రికా, హాంగ్ కాంగ్, నార్వేలకు ఎగుమతులు ప్రారంభించారు.


Click it and Unblock the Notifications








