మెర్సిడెస్ బెంజ్ లగ్జరి కార్లకు పేరు. అలాంటి మెర్సిడెస్ బెంజ్ యం.డి 'డా. విల్ ప్రెడ్ ఆల్ బుర్' తన మాటల్లోనే మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం ఎదుగుతుందన్నారు. బియమ్ డబ్లు మరియు ఆడి కార్ల పోటీని తట్టుకోని ఈరోజు మేము గర్వంగా నిలబడడానికి కారణం మా కృషి, పట్టుదల. పోయిన సంవత్సరం ఇండియాలో బియమ్ డబ్లు తో పోటిపడి వారికంటే ఎక్కువ కార్లు అమ్మి లగ్జరికార్ల అమ్మడంలో మాకు ఎవరూ సాటిలేరని నిరూపించాం. ఈ సంవత్సరం కూడా మెర్సిడెస్ బెంజ్ ఎక్కువ కార్లు అమ్మి తన సత్తా చాటుతుందని అనుకుంటున్నాను. 2009తో పోల్చుకున్నట్లైతే ఈ సంవత్సరం 84 శాతం అభివృద్దిని సాధించాము.
ఈ సంవత్సరం ఆటోమొబైల్స్ రంగం మంచి ఊపు మీద ఉండడం, దానితోపాటు చకాన్ ప్లాంట్ పుల్ స్వింగ్ మీద ఉండడం కూడా మాకు బాగా కలసివచ్చే అంశం. వీటితో పాటు ఈ సంవత్సరం కోన్ని కోత్త కార్లను కూడా ప్రవేశపెట్టనున్నాం. నాకు ఇండియా అంటే చాలా మక్కువ అని, అంతేకాకుండా నేను ఇండియా అమ్మాయిని పెళ్శి చేసుకోని నా మిగిలిన జీవితం ఇండియాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.