లగ్డరి కార్లకు పెట్టింది పేరు మెర్సిడెస్ బెంజ్. అలాంటి మెర్సిడెస్ బెంజ్ కంపెని నుండి నవంబర్ లో మరో ఆర్-క్లాస్ కారు రాబోతుంది. సీడాన్ మాదిరే దీని ధర కూడా రూ 60 లక్షలు ఉంటుంది. ఆర్-క్లాస్ కారు లగ్డరి యమ్ పివికి చిహ్నం. దీనిని మొట్టమొదటగా 2006లో జాతీయంగా విడుదల చేయడం జరిగింది. వచ్చే నెలలో లండన్ లో 'ఫేస్ లిఫ్టేడ్ వేరియంట్' బెంజ్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియాలో మాత్రం దీనిని నవంబర్ లో ప్రవేశపెడతామని అన్నారు.
మెర్సిడెస్ బెంజ్ కంపెని త్వరలో 'ఆర్-క్లాస్ సింగిల్ వేరియంట్' కారుని విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ఈ కారు లాంగ్ వీల్ R350తో 4MATIC వేరియంట్ ను కలిగి, ఈ కారు 3.5L V6 పెట్రోల్ ఇంజను శక్తి సామర్యం మరియు సీటింగ్ విషయంలో 7 మనుషులు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు.