త్వరలో రోడ్డెక్కనున్న కోటి రూపాయల 'చీప్ కారు'..!!

ఈ విషయాన్ని ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ఆటో షోలో డిసి డిజైన్స్ ప్రమోటర్ దిలీప్ ఛాబ్రియా వెళ్లడించారు. దీనికి గాను టాటా మోటార్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా ఆయన తెలిపారు. తొలుత ఒక్క కారునే రూపొందించాలనుకుంటున్నట్టు, అటు పిమ్మట ఆర్డర్లను బట్టి మరిన్ని కార్లను రూపొందిస్తామని ఆయన తెలిపారు.
మరో రెండు నెలల్లో విడుదల కానున్న ఈ కారు ఆడీ 6.0 లీటర్ వి 12 టిడిఐ ఇంజన్ తో రూపొంది, ఎస్ యువి, ఎంపివి తదితర సెగ్మెంట్లన్నింటిలోని సదుపాయాలను కలిగి వుంటుంది ఆయన తెలియజేసారు. కానీ ఈ ప్రాజెక్టులో టాటా మోటార్స్ పాలుపంచుకోవడం లేదు.


Click it and Unblock the Notifications








