కోట్ల పెట్టుబడులతో మీకోసం రంగంలోకి .......!

మారుతి: మనేసర్ లో రూ 1,700 కోట్ల పెట్టుబడులతో మూడో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మనేసర్ లో రెండో ప్లాంట్ ఉత్పాదక సామర్ధ్యాన్ని పంచుకోవడానికి ఎక్కువ మొత్తాన్ని వ్యయం చేస్తుంది.
రేనాల్ట్: భారత వినియోగదారుల అవసరాలకనుగుణంగా...మూడేళ్శలో కొత్త కారు మార్కెట్లోకి తేనుంది. రెండేళ్శలో చిన్న కారుతో సహా ఐదు కొత్త కార్లను మార్కెట్లోకి తెస్తోంది.
హీరోహొండా: నెలరోజుల్లో నాలుగో ప్లాంట్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది 50 లక్షలు టూవీలర్లు విక్రయిస్తామని అంచనా వేస్తుంది.
పియోజియో: రెండేళ్శలో వెస్పా స్కూటర్లను మళ్శీ మార్కెట్లోకి తేబోతుంది. బారామతిలో 3 కోట్ల యూరోలతో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ కోత్త ప్లాంట్ లో 125 సిసి గేర్ లెస్ స్కూటర్ ను ఉత్పత్తి చేయనుంది.
టయెటా: ఇతియోస్ మోడల్ లో హైబ్రిడ్ వేరియంట్ కు భారత్ లో అవకాశాలు ఎలా ఉంటాయో అధ్యయనం చేస్తామని తెలిపింది. ఇతియోస్ మోడల్ ను డిసెంబర్ లో మార్కెట్లోకి తెస్తోంది.
ఫోర్ఢ్: ఐదేళ్శలో ఎనిమిది కొత్త మోడళ్శ ను ప్రవేశపెట్టబొతోంది. 50 దేశాలకు ఫిగో కార్లను ఎగుమతి చేస్తామని పేర్కోంది. గత పదేళ్శ లో ఈ కంపెనీ భారత్ వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.
టాటా మోటార్స్: వివిధ విస్తరణ కార్యక్రమాల కోసం రూ 4,700 కోట్ల నిధులు సమీకరించనుంది.
కార్ల ధరలు పెంపు....
ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్, టయోటా కంపెనీలు తెలిపాయి. అన్ని మోడళ్శ ధరలను వచ్చే నెల 1వ తేదీ నుంచి 1.2 శాతం పెంచుతున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. అక్టోబర్ లో కార్ల ధరలను సవరిస్తామని టయోటా పేర్కోంది. అక్టోబర్ నుంచి మైలేజీ వివరాలు తప్పనిసరిగా కంపెనీలు వెల్లడించాలని తయారీదారుల సోసైటీ(సియామ్) స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








