చైనాలో జరగనున్నటువంటి 8వ ఇంటర్నేషనల్ ఆటో ఎగ్జిబిషన్ లో నిస్సాన్ కంపెనీ వారు కొత్త గ్లోబల్ సీడాన్ కారు ఎగ్జిబిషన్ లోప్రవేశపెట్టనున్నారు. ఈసందర్బంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ చైనా రోడ్ల మీద జనవరి 2011సంచరిస్తుందని, అటుతర్వాత ఇండియా రోడ్ల మీద రాబోయే Q3,2011లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఈకొత్త సీడాన్ కారు నిస్సాన్ మైక్రా కారులాగే ఉండడంతో పాటు కోన్ని కొత్త ఫీచర్స్ తోవిడుదలక సిద్దంగా ఉందని అన్నారు. ఇకఈకొత్త సీడాన్ కారు మారుతిసుజికిలో షిప్ట్ డిజైర్, టాటా ఇండిగో మన్జా, టోయోటా ఇతియోస్ కుపోటీగా నిలుస్తుందని అన్నారు.
ఇక గతంలో విడుదల చేసినటువంటి నిస్సాన్ మైక్రాకు కస్టమర్స్ నుండి మంచి స్పందన రావడంతో దీనిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అంతేకాకుండా నిస్సాన్ కంపెనీ విడుదల చేసినటువంటి ప్రతి కారు కూడా మంచి టెక్నికల్ ప్రమాణాలతో విడుదలవతాయని అన్నారు. నిస్సాన్ కార్లు దాదాపు 170దేశాలలో వాటి సత్తాని చాటుతున్నాయి. చైనా ఆటోమొబైల్ మార్కెట్ లోకూడా ఈసీడాన్ వల్ల ఒక ప్రత్యేక అద్యయనం ఏర్పడనుందని తెలిపారు.