చిన్న కార్లను రూపొందించడంలో దిట్ట అయిన హుందాయ్ మోటార్స్ సంస్థ వారి సాంత్రో, i20 కార్లు ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో i20 కారు ప్రస్తుతం మాగ్నా మరియు అస్తా ట్రిమ్స్ లో లభ్యమవుతోంది. ఈ కారుకొస్తున్న ఆదరణను, మార్కెట్ లో వోక్స్ వ్యాగన్ పోలో, ఫోర్డ్ ఫిగో, మారుతీ స్విఫ్ట్ కార్ల నుండీ ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి హుందాయ్ మోటార్స్ i20 మరియు సాంత్రో కార్లలో సరికొత్త వెరయిటీలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
i20 కారును ఎరా మరియు స్పోర్ట్స్ మోడళ్లలో విడుదల చెయ్యనుంది హుందాయ్ మోటార్స్. వీటితో పాటు సాంత్రో కారును సరికొత్తగా రూపొందించి విడుదల చెయ్యడానికి కూడా హుందాయ్ మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో i20 స్పోర్ట్ కారు ధర రూ. 5.5 లక్షలు కాగా ఎరా మోడల్ ధర రూ.4.6 లక్షలుగా నిర్ణయించారని సమాచారం.