చెన్నైలో నిస్సాన్ సెంటర్..

ప్రపంచం మొత్తం మీద నిస్సాన్ కంపెనీ ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ ఇప్పటికే ఆరు స్దాపించి, గ్లోబల్ మార్కెట్ లోతన సత్తా చూపించడానికి సిద్దం అవుతుందని అన్నారు. చెన్నైలో స్దాపించినటువంటి ఈఏడవ సెంటర్ ద్వారా ఇండియన్ మార్కెట్ లోకూడా పాగా వేయాలని అనుకుంటున్నామని అన్నారు. ఇండియాలో ఉన్న డీలర్స్ కుఅత్త్యుత్తమమైన స్టాప్ నుఇచ్చి నిస్సాన్ మార్కెటింగ్ బాగా ఉదృతం చేసి తనదైన శైలిలో లాభాలను మరియు కస్టమర్స్ యొక్క మనసుదోచుకోవాలన్నదే మాముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.
2005సంవత్సరం నుండి ఇండియా ఆటోమొబైల్స్ రంగంలోకి అడుగుపెట్టినటువంటి నిస్సాన్ మూడుసంవత్సరాలలోనే రేనాల్ట్ లోభాగస్వామిగా చేరడం జరిగింది. ఈరెండు కంపెనీలు కలసి రూ4500కోట్ల పెట్టుబడితో దాదాపుగా సంవత్సరానికి నాలుగు లక్షల యూనిట్లను తయారుచేస్తున్నాయన్నారు. దీనిని బట్టి త్వరలో ఇండియా రోడ్ల మీద చెన్నై ప్లాంటునుండి వచ్చినటువంటి నిస్సాన్ మైక్రా మార్చి నుండి తిరిగే అవకాశముందని అన్నారు. ప్రస్తుతానికి నిస్సాన్ మైక్రా ప్రపంచం మొత్తం మీద ఇరవై డీలర్స్ నుకలిగిఉండి దాదాపు 100దేశాలకు ఎగుమతి అవుతున్నది. వచ్చే మూడుసంవత్సరాలలో డీలర్స్ సంఖ్యను వంద వరుకు పెంచనున్నట్లు తెలిపారు. మైక్రా పెట్రోల్ వర్సన్ కార్లు ఇండియాలో ఇప్పటివరకు 4500యూనిట్లు అమ్మాకాలు నమోదు చేశాయన్నారు.


Click it and Unblock the Notifications








