సెకెండ్ హ్యాండ్ మార్కెట్ లో 'నానో'..!!

గత రెండు మాసాల వ్యవధిలో మొత్తంగా 15 నానో కార్లు సెకెండ్ హ్యాండ్ మార్కెట్ లో దర్శనమిచ్చాయంటే నానో పరిస్థతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మార్కెటింగ్ నిపుణులు మాట్లాడుతూ నానో కారును బుక్ చేసిన వారిలో సగానిపైగా ఈ కారును ఉపయోగించాలనే ఉద్యేశ్యంలో ఆర్డర్ చెయ్యలేదు, నానో కారుంటే తమ ప్రతిష్ట పెరుగుతుందనే ఆలోచనే వారిచేత ఈ కారును ఆర్డర్ చేసేలా చేసిందని అభిప్రాయపడ్డారు.
మరికొంత మంది ఈ కారు ఎలా వుందో అనే ఆశక్తితో ఆర్డర్ ఇచ్చినట్టు, కానీ ఈ కారు వారు వాడుతున్న ఖరీదైన కార్లంత సౌకర్యవంతంగా లేకపోవడంతో సెకెండ్ హ్యాండ్ మార్కెట్ కు తరలిస్తున్నారని మరో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏది ఎలా వున్నా పరిస్థితి ఇలాగే వుంటే టాటా మోటార్స్ కు 'నానో' పెద్ద దెబ్బే అని బిజినెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








