యూత్ కోసం సూపర్ ఫాస్ట్ స్పోర్ట్ కార్..!

ఆసిస్ ఛోర్డియా(డైరెక్టర్ ఆఫ్ ఫోర్సి ఇండియా) మాట్లాడుతూ న్యూడిల్లీ లో మొట్టమొదటగా మేము ఈ షోరూంను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ షోరూం ద్వారా మీకు మేము మంచి క్వాలిటీతో పాటు అత్యున్నతమైన ప్రమాణాలు గల వాహానాలను అందించడంతో పాటు, మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్శతామని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇండియా మొత్తం మా షోరూంలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మొదటగా హైదరాబాద్, చెన్నై, ఛండీఘర్, కోచి మరియు అహ్మదాబాద్ లలో షోరూంలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పది సంవత్సరాల నుండి చూసుకున్నట్లేతే ఫోర్సి చాలా అభివృద్ది సాదించిందని, ఇంకా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నామని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








