ప్రణభ్ ఎఫెక్ట్: కారు ఇక కలలో మాటే..!!

మొదటగా భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ బడ్జెట్ ఎఫెక్ట్ తో భారీ వాహనాల మీద రూ.60,000 నుండీ రూ.70,000 వరకూ, అదే చిన్న తరహా వాహనాల మీద 5,000 నుండీ 6,000 వరకూ ధరను పెంచనున్నట్టు టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ పియం తెలంగ్ స్పష్టం చేసాడు.
దక్షిణ కొరియాకు చెందిన మరో ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ మోటార్స్ సంస్థ సరాసరి రూ.6,500 నుండీ రూ.25,000 వరకూ ధరలను పెంచనుంది. ఇక భారతదేశ నెం.1 ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకీ ఇప్పుడున్న ధరల మీద మరో 2% పెంచాలనుకుంటున్నట్టు తెలిసింది. దీంతో ఇక ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో కుదేలయిన వినియోగదారుడు ఇక కారు కొనాలంటే జంకే పరిస్థితి, మరి మధ్యతరగతి వారికి కారు కలలో మాటే..!!


Click it and Unblock the Notifications








