హుండై అమ్ములపొదిలోకి మరో కొత్త మోడల్..

ఇక ఈ హుండై సాంతా ఫీ విషయానికి వస్తే 2.2లిట్ ఇంజను సామర్ద్యం కలిగి, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ సామర్ద్యంతో లీటర్ కి 14.66 కిమీ మైలేజీతో ఈ కారు నడుస్తుందన్నారు. కంపెనీ సిఇవో మాట్లాడుతూ ఈ దశాబ్దంలో 20లక్షల కార్లు గ్యారంటీగా అమ్ముతామని అన్నారు. ఈ కారు వల్ల ఇండియాలోని ఆటోమొబైల్స్ మార్కెట్ రంగంలో మా సత్తా తెలుస్తుందన్నారు. అంతేకాకుండా యస్ యువి సెగ్మంట్ లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఈ సాంతా ఫీ కారు రెండవ జనరేషన్ కార్లకు చాలా గట్టి పోటీనిస్తుందని అన్నారు. ఇండియా మార్కెట్ లో సౌత్ కోరియన్ కార్ మేకర్ తయారుచేసినటువంటి ఏడవ మోడల్ కారు సాంతా ఫీ. దీనిని బట్టి చూస్తుంటే ఇండియన్ ఆటోమొబైల్స్ రంగంలో టాటా నానో మాదిరి ఈ సాంతా ఫీ కూడా సంచలనం సృష్టించాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








