బాలీవుడ్ బాద్షా ఆవిష్కరించిన హుందాయ్ i10 ఎలక్ట్రిక్ వెర్షన్..!!

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హుందాయ్ మోటార్స్ బహుళజనాదరణ పొందిన i10 కారు ఎలక్ట్రికి వెర్షన్ ను విడుదల చేయడం. బుధవారం (జనవరి 6న) నాడు బాలీవుడ్ బాద్షా, హుందాయ్ మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్ షారూఖ్ ఖాన్ ఈ కారును ఆవిష్కరించారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ కారు 49KW(66.6 PS) ఎలక్ట్రిక్ మోటార్ తో రూపొందింది. ఇందులో ఎలక్ట్రిసిటీ 16 KWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లో స్టోర్ చేసుకొనేలా రూపొందించారు. ఈ తరహా బ్యాటరీలనే సెలఫోన్ మరియు ఇతర ఎలక్ట్రిక్ పరికరాలకు ఉపయోగిస్తున్నారు.
2007లో జరిగిన ఆటో షోలో షారూఖ్ చేతుల మీదుగానే విడుదలయిన i10 కారు అందరినీ ఆకట్టుకుని ఫ్యామిలీ కార్ల విభాగంలో సింహ స్థానాన్ని ఆక్రమించింది. దీంతో ఈ కారుకు ఉన్న ఆదరణ ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ను తేవడానికి ఊతమిచ్చిందని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. i10 ఎలక్ట్రిక్ కారుతో పాటు జెనిసిన్ కూవ్, ఐ-మోడ్ మోడళ్లను సైతం షారూఖ్ చేతుల మీదుగానే ఆవిశ్కరింపజేసింది హుందాయ్....!!


Click it and Unblock the Notifications








