పూణెలో అంగరంగ వైభవంగా స్టార్ ఫ్యాషినేషన్ ఫీస్ట్ 2010..!

సుహాస్ కడ్లాస్కర్ (డైరెక్టర్ కార్పోరేట్ ఎఫైర్స్) మెర్సిడెస్ బెంజ్ ఇండియా మాట్లాడుతూ మెర్సిడెస్ బెంజ్ షోరూంలలో ప్యామిలితో పాటు యూత్ ని కూడా ఆకట్టుకునే విధంగా రూపోందించనున్నామని ఆయన తెలిపారు. ఆటో మొబైల్స్ చరిత్ర లోనే మొట్టమొదటిసారిగా ఇలా చేస్తున్నామని ఆయన అన్నారు. ఇండియా మొత్తం ఉన్న మెర్సిడెస్ బెంజ్ షోరూంలలో ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ డీలర్ షిప్స్ కు లైప్ స్టయిల్ సెగ్మేంట్, గేమింగ్ కన్సోల్, హై ఎండ్ కేఫ్, డిజైనర్ యాససరీస్ అన్ని హాంగులను అందుబాటులోకి తేనున్నామని ఆయన తెలిపారు.
మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో ఉన్న అన్ని డీలర్ షిప్స్ నుండి కస్టమర్ కేర్ కాన్పెప్ట్ ను ప్రవేశపెట్టనున్నామని అన్నారు. అన్ని మెర్సిడెస్ బెంజ్ డీలర్ షిప్స్ లలో సి-క్లాస్, ఇ-క్లాస్, ఎల్ఎస్-క్లాస్, జిఎల్-క్లాస్, ఇ-క్లాస్ కాబ్రియాలెట్ అండ్ ఇ-క్లాస్ కూప్ కార్లను మెర్సిడెస్ బెంజ్ ఎక్సీపిరియన్స్ జోన్లో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా అన్ని కార్ల గురించి పూర్తి సమాచారం ఎప్పుడు కావాలన్నా, కలర్ కాన్పిగరేటర్, ప్రోడక్ట్ ఇమేజస్, బ్రోచర్స్, టెక్నికల్ స్పెసిపికేషన్స్ డిటైల్స్, సింగిల్ టచ్ లో వీడియోస్, బ్లూ యపై టెక్నాలజీ, మెర్సిడెస్ బెంజ్ యాససరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ మ్యాగజైన్స్ అందరికి అందుబాటులో ఉంటాయన్నారు.
మెర్సిడెస్ బెంజ్ షోరూంలలో కొత్తగా లైఫ్ స్టైల్ షోరూంలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ లైఫ్ స్టైల్ షోరూంలలో ఇండియా ప్రయుఖ డిజైనర్ మనీష్ అరోరా రూపోందించినటువంటి డిజైనర్ వేర్ డ్రస్సులు ఉంటాయని అన్నారు. వీటి ధర రూ 3500 నుండి రూ 5000 వరకు ఉంటుందని అన్నారు. ఇలా చేయడానికి కారణం మెర్సిడెస్ బెంజ్ కార్లను ఓ నూతన బ్రాండ్ వైపు నడిపించడమేనని అన్నారు.
చివరగా ఈ స్టార్ ఫ్యాషినేషన్ ఫీస్ట్ లో ఉన్నంత సేపు మీకు ఓ అందమైన కార్ల ప్రపంచంలో తెలియాడుతున్నట్లు ఉంటుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








