టాటా కోత్త బస్సు సింప్లీ సూపర్..

ఇకపోతే ఈబస్సులు పెట్రోల్ మరియు డీజిల్ తోనడిచేలాగా కాకుండా పవర్ తోనడపడడం వల్ల ప్యూయల్ ఎపిసియన్సీతోపాటు కాలుష్యాన్నికూడా కోంత తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈబస్సులు మంచి గ్రీన్ వాతావరణానికి సహాకరిస్తున్నాయని, వాతావరణశాఖ కూడా ఈబస్సులకు ప్రయాణికులకు ఎటువంటి హాని కలగజేయని వాహానాలుగా ముద్రవేశారు. టాటా ఈబస్సులను ఎలక్ట్రిక్ మోడ్, సిఎన్జీ మైక్రో టర్బైన్ మరియు హైడ్రోజన్ ప్యూయల్ సెల్ తోరూపోందించడం జరిగిందిని అన్నారు. ఇక బస్సు ఎత్తు 350మిమిలు కాగా ఈబస్సులో ఇక ప్రత్యేకతలు చెప్పాల్సిన పనిలేదు. ఎయిర్ కండీషనర్, బేబి సీట్, లగేజి రూమ్, వైపై, సెక్కురిటీ కెమెరా, వీల్ ఛైర్, ఎలక్ట్రికల్ ర్యాంప్, రిజర్వ్ కెమెరా, ఎలక్ట్రానిక్ డిప్లే బోర్డు, టిక్కెటింగ్ మిషన్ లాంటి ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు ఈబస్సులో ఉన్నాయి. ఇక బస్సు గంటకు 70కిమీ వేగంతో పరుగెత్తుందని సమాచారం. చివరగా ఈబస్సు అర్బన్ ప్రాంతాలలో మాత్రమే పనికివస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications








