ఈ సారి టాటా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..??

భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త మల్టీపర్పస్ వెహికల్ టాటా ఇండిక్రూజ్ ఎప్పుడు వస్తుందోనని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. టయోటా ఇన్నోవా, చెవ్రోలెట్ టవేరా, మహీంద్రా గ్జిలో వంటి మల్టీపర్పస్ వాహనాలకు పోటీగా టాటా మోటార్స్ రూపొందించిన ఈ టాటా ఇండిక్రూజ్ జనవరి 5 నుండీ మొదలయ్యే డిల్లీ ఆటో షోలో విడుదల చెయ్యనున్నారు.
దీంతో పాటు ఇండికా విస్తా ఇగ్నిస్, టాటా ప్రీమియం ట్రక్కు ఈ ఆటో షో లో విడుదలకానున్నాయి. అక టాటా మోటార్స్ లో బహుళజనాదరణ పొందిన ఇండికా ఎలక్ట్రిక్ వెర్షన్ కారు, నానో హైబ్రిడ్ మోడల్ లను కూడా ఈ ఆటో షోలో ప్రదర్శనకు తీసుకురావడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








