సమస్యలు గాలికొదిలేసి కొత్త కార్లు రూపొందిస్తున్న టాటా మోటార్స్

విశ్వసనీయ సమాచారం ప్రకారం డాల్ఫిన్ పేరుతో రూపొందనున్న ఈ కారు నానో కారు మోడల్ లోనే కొంచం పెద్దగా వుంటుందని తెలిసింది. అంతే కాదు ఈ కారు 800 సిసి, 1లీటర్ ఇంజన్ తో రూపొందనుందట. ఈ కారు ధర సుమారు రూ.3 లక్షలు వుండవచ్చని అంచనా. ఈ కారుతో ప్రస్తుత మధ్యస్థ కార్ల మార్కెట్ ను శాసిస్తున్న హుందాయ్ సాంత్రో, మారుతీ సుజుకీ ఆల్టో వంటి కార్లకు చెక్ పెట్టాలని టాటా మోటార్స్ భావిస్తోందట.
ఇక వరుసగా ఆరు నానో కార్లు అగ్ని ఆహుతి అయినా ఆ అదేదో మినహాయింపు, మా కారు భేష్ అని భుజాలు తట్టుకుంటున్న టాటా మోటార్స్ ఆ లోపం సవరించడంపై దృష్టి నిలపకుండా ఇలా నిమ్మకునీరెత్తినట్టు వుండటం మీద ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా టాటా మోటార్స్ స్పందించడం లేదు.. ఏ ధైర్యంతోనో మరి...!?


Click it and Unblock the Notifications








