గత నెలలో ధరల పెంపుదలపై ఓ ప్రకటన విడుదల చేసిన టాటా మోటార్స్ సంస్థ మరో సారి 2% ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. ఇటీవలే మారిన ఎమన్షన్ నిబంధనల ప్రకారం కార్లలో మరిన్ని ఆధునిక టెక్నాలజీలలు ఏర్పాటు చేయవలసి రావడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుంటోందని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ప్యాసింజర్ వాహనాల మీదనే ఈ పెరుగుదల నమోదుకానుందని వారు తెలిపారు.
ఇటీవలే భారతీయ ప్రభుత్వం దేశంలోని 13 నగరాల్లో భారత్ స్టేజి-IV నిబంధనలు అమలు చెయ్యాలని ఆటోమొబైల్ సంస్థలకు సూచించిన సంగతి తెలిసిందే. దాంతో మరిన్న ఆటో సంస్థలు ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అశోకా లైలాండ్ సంస్థ ఇప్పటికే 15% ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది.