టాటా మోటార్స్ 2009వ సంవత్సర ఉత్తమ ఆటోమొబైల్ కంపెనీ..!!

నానో 2009వ సంవత్సరానికి 'కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో పాటు 'వ్యూయర్స్ కార్ ఆఫ్ ది ఇయర్', 'ఉత్తమ డిజైన్', 'వ్యాల్యువ్ ఫర్ మనీ కార్' అవార్డులను సొంతం చేసుకుంది. కాగా గత ఏడాది విడుదలయిన టాటా మోటార్స్ సరికొత్త సేదన్ టాటా ఇండిగో మాంజా కారు ఉత్తమ ఎంట్రీ లెవల్ సేదన్ గా నిలిచింది. ఈ ఐదు అవార్డులతో పాటు టాటా మోటార్స్ 2009 వ సంవత్సరానికి 'కార్ మేకర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ అవార్డుల్లో అంతర్జాతీయ లగ్జరీ కార్లు రూపొందించే మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కారు లగ్జరీ సేదన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.
ఇక టూ-వీలర్ విభాగానికి వస్తే బజాజ్ ఆటో ఉత్తమ టూ-వీలర్ కంపెనీగా నిలిచింది. ఉత్తమ బైక్ ఆఫ్ ది ఇయర్ గా బజాజ్ పల్సర్ 135LS బైకు ఎంపికయింది. బజాజ్ డిస్కవర్ బైకు 100 సిసి బైకుల విభాగంలో ఉత్తమ బైకు అవార్డుతో పాటు, 'వ్యాల్యువ్ ఫర్ మనీ బైక్' అవార్డును సొంతం చేసుకుంది. కవాసాకీ నింజా 250 సిసి బైకుల విభాగంలో ఉత్తమ బైకుగా నిలిచింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ క్లాసిక్ 251 సిసి అంతకన్నా ఎక్కువ సిసి గల బైకుల విభాగంలో ఉత్తమ బైకు అవార్డుతో పాటు వ్యూయర్స్ ఛాయిస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. 2009వ సంవత్సరానికి బైక్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును హీరో హోండా కంపెనీ సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications








