పొరుగు దేశాలకు టాటా 'నానో'

బంగ్లాదేశ్ లో టాటా మోటార్స్ వాహనాలను పంపిణీ చేస్తున్న నిటోల్ మోటార్స్ లిమిటెడ్ వారే ఈ కారును బంగ్లాదేశ్ లో పంపిణీ చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ వారు నానో కారు అప్రూవల్ కోసం అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నారట. ప్రస్తుతానికి పెండింగ్ లో వున్న ఈ అప్రూవల్ త్వరలోనే ఆమోదం పొందనుందని సమాచారం.
ఇక ఈ కారును బంగ్లాదేశ్ కు ఎగుమతి చేస్తే ఇక్కడ లక్షకు అటుఇటుగా పలికే నానో కారు అక్కడ సుమారు రూ. 3.94 లక్షలు పలుకుతుంది. దీంతో ఈ కారును బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోందట నిటోల్ మోటార్స్. ఇలా అయితే ఈ కారు ధర రెండు లక్షల కన్నా తక్కువగా వుండే అవకాశం వుంది. దీంతో ఈ ఫ్లాంటు ఏర్పాటు కోసం కూడా నిటోల్ మోటార్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అలా అన్ని దేశాల్లో విస్తరిస్తున్న నానో మన పొరుగుదేశం అయిన పాకిస్తాన్ లో కూడా విడుదలయితే ఎలా వుంటుంది...!! బాగుంటుంది కదూ..! కానీ ఇది జరిగేలా లేదని ఇప్పటి వరకూ అందిన సమాచారం.


Click it and Unblock the Notifications








