భలే మంచి చౌక బేరము!

మరో వైపు అమ్మకందారులు కూడా తమ వద్ద వున్న పాత స్టాక్ ను వదిలించేందుకు భారీ మొత్తంలో రాయితీలను ప్రకటిస్తున్నారు. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఈ పాత స్టాకును వదిలించుకొని సరికొత్త ప్రమాణాలతో రూపొందిన కార్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని సమాయత్తం అవుతున్నాయి. దీని కోసం వారు డిస్కౌంట్లను మార్గంగా ఎంచుకుంటున్నారు. అమ్మకాలను పెంచుకునేందుకు వీరు ఎక్కువ మొత్తంలో రాయితీలు ఇస్తున్నారు. పోయిన ఏడాది ఇదే కాలంలో ఇచ్చిన రాయితీల కన్నా ఈ ఏడాది 10 నుండీ 15 శాతం అధికంగా వినియోగదారలకు లభించనున్నాయి. చిన్న కార్ల మీద రాయితీలు సమారు రూ.10,000 నుండీ 15,000 వరకూ వుంటున్నాయి. ఇక బిఎన్ IV ప్రమాణాలు అమలులోకి రావడానికి కేవలం ఆరు రోజులే వుండటంతో ఈ ధరలు మరింతగా తగ్గనున్నాయి. మరింకెందుకు మంచి తరుణం మించిన దొరకదు. కారు కొనాలనుకునే వారు వెంటనే కొనేయండి.


Click it and Unblock the Notifications








