1983లో విడుదలయిన మారుతీ సంస్థ వారి ఫ్యామిలీ కారు మారుతీ 800 ఎంతో మంది హృదయాలను దోచుకొని... ఎంతో మందికి సేవలు చేసింది. కానీ ఈ కారు రేపటి నుండీ భారతదేశంలోని 13 ప్రముఖ నగరాల నుండీ వెలివేయబడుతోంది. పర్యవరణానికి మంచి చెయ్యలనే ఉద్దేశ్యంతో రూపొందిన భారత్ IV ఎవన్షన్ నిబంధనల ప్రకారం మారుతీ-800 కారు పంపిణీని ఈ 13 నగరాల్లో నిలిపివేయనున్నారు. దీంతో ఈ కారు బుకింగులకు ఈ రోజే చివరి రోజు కానుంది. న్యూఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, చెన్నై, పూనే, అహమ్మదాబాదు, సూరత్, కాన్పూర్, ఆగ్రా, హైదరాబాదు, బెంగుళూరు నగరాల్లో ఈ కారు బుకింగులు నేటితో ముగియనున్నాయి.
ఇక ఈ నగరాలను మినహాయించి మిగితా చోట్ల ఈ కారు మరికొద్ది రోజులు అందుబాటులో వుంటుంది. కానీ ఆ తర్వాత ఈ పట్టణాలలో కూడా ఈ కారు కనుమరుగు కానుంది. ఈ కారు స్థానంలో మారుతీ సుజుకీ సెర్వో అనే మరో చిన్న కారును మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.