టయోటా 'ఇతియోస్' తో సంచలనం

నాలుగేళ్లపాటు 2000 మంది ఇంజినీర్లు శ్రమించి ఇతియోస్ కారును రూపొందించారు. ముందుగా భారత్ విపణిలో ప్రవేశపెట్టి ఆ తర్వాత విదేశాల్లో విడుదల చేస్తారు. సెడాన్, హ్యాచ్‌బాక్ విభాగాల్లో ఇతియోస్ కారును ప్రవేశపెడతారు. ఈ ఏడాది చివరిల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్‌లోకి విడుదల చేసే వీలుంది. ధర ఇంత వరకు నిర్ణయించలేదు. ఈ శ్రేణి కార్లలో ఇదే అత్యుత్తమ మైలేజీ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. ఈ కార్ల తయారీకి బెంగళూరు సమీపంలో బిడాడిలో కంపెనీకి ఉన్న ప్లాంట్ పక్కనే రూ.3,200 కోట్లతో రెండో ప్లాంట్ నిర్మిస్తున్నాం. తొలి ఏడాదిలోనే 70 వేల ఇతియోస్ కార్లు విక్రయం కాగలవని అంచనా వేస్తున్నామని శైలేశ్ చెప్పారు. కంపెనీ వెల్లడించనప్పటికీ.. ఇతియోస్ సెడాన్ ధర దాదాపు రూ.6 లక్షలు, హ్యాచ్‌బ్యాక్ ధర రూ.5 లక్షలు ఉండగలదని డీలర్లు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








