అవమానభారంతో తలదించుకున్న టయోటా అధినేత

By

Akio Toyoda
జపాకు చెందిన ప్రపంచ అతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ టయోటా మోటార్స్ ప్రకటించిన రీ-కాల్ విస్తరిస్తూపోతోంది. తొలుత అమెరికా, జపాన్ లలో తమ కార్ల రీ-కాలింగ్ కు పిలుపునిచ్చిన టయోటా తాజాగా దీన్ని చైనాకు కూడా విస్తరించింది. దీంతో టయోటా అధినేత అకియో టొయొడా చైనా రాజధాని బీజింగ్ చేరుకుని ఇక్కడి ప్రజలకు తలవంచి క్షమాపనలు కోరాడు. గత వారం అమెరికా ప్రజానీకానికి ఇలాగే తలదించుకొని క్షమాపనలు చెప్పిన అకియో టొయొడా ఈ వారం చైనా చేరుకున్నాడు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ "చైనా మా సంస్థకున్న అతి పెద్ద మార్కెట్. మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, కానీ ఇప్పుడు మావల్ల ఓ పొరపాటు జరిగింది. అందుకు నేను మిమ్మల్ని క్షమాపన అడుగుతున్నాను. ఈ తప్పును సరిదిద్దుకొనేందుకే ఈ రీ-కాల్ కు పిలుపునిచ్చాము. దయుంచి మీరు మాకు సహకరించి మా సంస్థపై ఎప్పటిలానే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను" అని చెప్పారు. ఈ చైనా రీ-కాల్ తో ప్రపంచ వ్యాప్తంగా టయోటా సంస్థ మొత్తంగా 8.5 మిలియన్ కార్లను రీ-కాల్ కు పిలుపునిచ్చినట్టయింది. మరిది ఎంత వరకూ విస్తరిస్తుందో.. అకియో టొయొడా ఇంకా ఎన్ని దేశాలకు క్షమాపనలు చెప్పుకుంటూ తిరగాలో మరి...!!

More from DriveSpark

Article Published On: Tuesday, March 2, 2010, 10:12 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+