అందుబాటు ధరలో టోయోటా ఇతియోస్

టోయోటా ఇతియోస్ కార్లుకు సంబంధించినటువంటి ప్లాంటుని బెంగుళూరులో రూ3200కోట్ల పెట్టుబడితో పెట్టడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా సంవత్సరానికి దాదాపుగా 70000యూనిట్లును తయారుచేయనున్నట్లు తెలిపారు. ఇక టోయోటా ఇతియోస్ విషయానికి వచ్చే సరికే ఇంజను సామర్ద్యం 1500సిసిగా ఉంటుందని తెలిపారు. మార్చి 2011లోకల్లా ఈకారుకి సంబంధించినటువంటి డీజిల్ వర్సన్ కూడా మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇక కారుని బుక్ చేసుకోవాలనుకునే వారు జనవరి 2011నుండి బుకింగ్స్ మొదలవుతాయని కంపెనీ డిప్యూటి యమ్ డి చెప్పారు. ప్రస్తుతానికి కంపెనీ టోయోటా ఇన్నోవా, కోరోల్లా, మరియు కార్మి లాంటి సీడాన్ కార్లు అమ్ముతున్న విషయం అందరికి తెలిసిందే. చివరగా టోయోటా ఇతియోస్ వల్ల మాకు ఇండియన్ మార్కెట్ లోమంచి లాభాలను ఆశిస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications








