టయోటా హైబ్రిడ్ కారు 'ప్రియుస్' విడుదల..!!

1997లో విడుదలయిన మొదటి హైబ్రిడ్ కారుకు మూడో వెర్షన్ ఈ ప్రియుస్ హైబ్రిడ్ కారు. 26.55 నుండీ 27.86 లక్షల మధ్య ఈ కారు ధరను నిర్ణయించారు. ఈ కారు 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, 60 కిలోవాట్ల బ్యాటరీతో రూపొందిన ఇంజన్ తో విడుదలయింది. కాగా ఈ కారు పవర్ మోడ్, ఎకో మోడ్, ఎలక్ట్రిక్ వెహికల్ మోడ్ అనే మూడు డ్రైవింగ్ మోడ్ లలో లభిస్తుంది.
జపాన్ నుండీ పూర్తిగా అసెంబుల్డ్ ప్రియుస్ కార్లను దిగుమతి చేసుకుని భారతీయ మార్కెట్ లో విక్రయించనున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటర్ డిప్యూటీ మ్యానేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ తెలియజేసారు. ఇప్పటికే 200 యూనిట్లను భారతీయ మార్కెట్ కొరకు ఆర్డర్ చేసినట్టు ఈ వాహనాలు 2010 వ సంవత్సరం మార్చి నుండీ డిసెంబరు మాసాల మధ్య అమ్మకానికి రానుందని సింగ్ తెలియజేసారు.


Click it and Unblock the Notifications








