ఇండియాలో కొరొలా ఆల్టిస్ డీజిల్ వెర్షన్ విడుదల

టొయోటా ఉత్తమ టెక్నాలజీని భారత్‌కు పరిచయం చేయడంలో భాగంగానే ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. లీటర్ డీజిల్‌కు 21.43 కిలో మీటర్ల మైలేజీని కొరొలా ఆల్టిస్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఎటియోస్ పట్ల కంపెనీ భారీ అంచనాలను వ్యక్తం చేస్తోంది.
వచ్చే సంవత్సరంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 1,50,000 యూనిట్లకు చేరతాయని, ఇందులో 67,000 యూనిట్లు ఎటియోస్ కార్లే ఉంటాయని అంచనా వేస్తున్నట్లు టొయోటా కిర్లోస్కర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు. ఇక కొత్త సెడాన్ పెట్రోల్, సిఎన్‌జిలో కూడా అందుబాటులో ఉంది. ఎటియోస్‌లో మొదట పెట్రోల్ వెర్షన్‌ను తీసుకువస్తామని, డీజిల్ వెర్షన్‌ను తీసుకురావడానికి సంబంధించి మార్కెట్ అధ్యయనాన్ని చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








