అమ్మో టయోటా కార్లా..జర భద్రం గురూ..!!

జపాన్ దేశానికి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా సంస్థ ఇటీవలి కాలంలో రీ-కాల్ లతో సతమతమవుతోంది. డెలివరీకి ముందు కనిపెట్టని లోపాలు దొంగలు పోయిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు సంస్థ వర్గాలు ఇటీవలే కనిపెట్టడంతో తిరిగి కార్లను వెనక్కు తీసుకురావడానికి ఆదేశించింది. ఇప్పటికే 2 మినియన్ కు పైగా వాహనాల రీ-కాల్ కు ఆదేశించిన టయోటా మోటార్స్ తాజాగా 436,000 హైబ్రిడ్ కార్ల రీ-కాల్ కు ఆదేశించనున్నట్టు సమాచారం. ఇందులో టయోటా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించిన ప్రియుస్ కారు మోడళ్లు కూడా వుండటంతో అంతటా విశ్మయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కాలిఫోర్నియా కోర్టులో టయోటా మోటార్స్ మీద వాజ్యం దాఖలయింది.
గుడ్డికన్నా మెల్ల నయం అన్నట్టు ఈ రీ-కాల్ సమస్యలు భారత్ లో లేకపోవడం కొంత ఉపశమనం. అయినా రీ-కాల్ లు టయోటా మోటార్స్ కు కొత్తేం కాదు, ఇంతకు ముందు కూడా లోపాల కారణంగా రీ-కాల్ కు పిలుపునిచ్చి, అమ్మకాలు ఘననీయంగా పడిపోయినా ఆ తర్వాత నిలదొక్కుకుంది. మరి ఈ దఫా పర్యావసానాలు ఏ విధంగా వుండనున్నాయో కానీ టయోటా కారు కొంటుంటే జర జాగ్రత్త గురూ..


Click it and Unblock the Notifications








