వోక్స్ వాగన్ మరియు మారుతి-సుజికి కలయికలో బుల్లికారు..!

వోక్స్ వాగన్ ఇండియా ఛీఫ్ మూల్లర్ మాట్లాడుతూ 8శాతం మార్కెట్ షేర్ ని కంపెనీ సోంతం చేసుకోవడానికి ప్రయత్నస్తున్నాం. రాబోవు 3-4సంవత్సరాలలో ఇండియా కార్ మార్కెట్ 3మిలియన్ లకు చేరుతుందని అన్నారు. ఈ సందర్బంలో మారుతి-సుజికి చైర్మన్ ఆర్ సి భార్గవ మాట్లాడుతూ ఈ నిర్ణయం వోక్స్ వాగన్ కి మరియు సుజికి మోటారా కార్పోరేషన్ సంబందించినది. దీనిపై స్పందించిన సుజుకి ఛీఫ్ ఒసాము సుజికి చెప్పినట్లు డిజైనింగ్ కాంపోనెంట్స్ మొదలు పెట్టి తర్వాత సైలెంట్ గా ఉంటే వారితో మన సంబంధాలు దెబ్బతింటాయన్నారు. వోక్స్ వాగన్ మరియు మారుతి- సుజికి కాంట్రాక్ట్ పద్దతి మీద తయారుచేస్తారని, దానికి కారణం ప్రస్తుతం వారి షేర్స్ నిస్సాన్ ఉన్నాయని ఆయన అన్నారు.
మారుతి త్వరలో తన ఆరవ ప్లాంట్ ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. దీనిపై దాదాపుగా 1,925కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. 2013కల్లా కనీసం 2.5లక్షల కార్లను ప్రవేశపెట్టాలంటే కొత్త ప్లాంట్ అవసరం అన్నారు. అంతేకాకుండా ఇండియా చుట్టుప్రక్కల 15లక్షల కార్లను ఎగుమతి చెయ్యాలని అన్నారు. రాబోవు ఐదు సంవత్సరాలలో దాదాపుగా 30లక్షల కార్లు అమ్ముడవుతాయని వారు అంచనా వేశారు.


Click it and Unblock the Notifications








