వోల్వో మన ఇండియాలో తన కంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. లగ్జరి బస్సులను తయారిచేయడంలో వోల్వో ది అందవేసిన చేయి. 2010 సంవత్సరంకుగాను తన రెవెన్యూ వాటాను 25-30 శాతం వరకు పెంపోందించుకోవడానికి వోల్వో ప్రయత్నిస్తుంది. వోల్వో బస్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ పస్సే మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న దానికంటే కోచ్ సెక్టార్ లో మేము ప్రయివేటు కోచ్ సెక్టార్లో ముందుకి సాగుతున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం 550-600 యూనిట్స్ ని అమ్మాలని, మాకు 80 శాతం బిజినెస్ కోచెస్ నుంచే వస్తుందని ఆయన అన్నారు.
పోయిన సంవత్సరం సేల్స్ చూసినట్లయితే మెజారిటీ గా బస్సులను పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వారు కోనడం జరిగినది. కాని ఈ సంవత్సరం ప్రయివేట్ సెక్టార్ లో కోచ్ లకు డిమాండ్ ఎక్కువ వుంది. వోల్వో కూడా ప్రస్తుతం కోచెస్ సెగ్మంట్ లో వృధ్ధి చెందాలని కోరుకుంటుంది. ఇటీవల కాలంలో రాజస్థాన్, కేరళ, బెంగళూరులలో కోచెస్ అమ్మడం జరిగిందన్నారు.