మేము మళ్లీ బుకింగ్స్ మెదలు పెట్టాము..

మరలా బుకింగ్స్ మెదలు పెట్టడానికి కారణం కంపెనికి ఆర్డర్స్ రావడంతో పాటు అక్టోబర్ నెలలో హిందు, ముస్లిం పండుగలు వుండడం. టాటా మోటార్స్ నానో కారు ప్రపంచంలో కెల్లా చౌకయిన కారు. దీని వెల కేవలం రూ 1,23,361. ప్రస్తుతం టాటా మోటార్స్ కంపెని వారు నానో కారు ధరను 3% - 4% వరకు పెంచడం జరిగినది. దానికి కారణం పెరిగిన వ్యాట్, పన్నులు, ముడి సరుకు ధరలు అని అంటున్నారు. ఏప్రిల్ నుండి జులై వరకు 23,379 నానో కార్లు అమ్ముడు పోయాయని అన్నారు.
ఈ సారి అన్నా ప్రమాదాలు జరగకుండా నానో కారును పూర్తిగా పరీక్షించాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఇంతకు ముందు జరిగిన ప్రమాదాలకు ఏదో చిన్న సాంకేతిక లోపం అని సర్దిచెప్పిన టాటా సంస్థ ఈ సారి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ మంది కస్టమర్లను తన ఖాతాలో వేసుకోవచ్చు. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే..?


Click it and Unblock the Notifications








