హుందాయ్ మోటార్స్ లో బహుళజనాదరణ పొందిన i-సీరీస్ కార్లలో i10, i20 ఇప్పటికే భారతీయ విపణిలో తమ హవాను కొనసాగిస్తుండగా ఈ సీరీస్ లో మరో కారు i30 ఈ ఏడాది భారతీయ రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. ఐదు డోర్ల ఈ చిన్న ఫ్యామిలీ కారును జర్మనీలోని హుందాయ్ టీమ్ రూపొందించింది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ వెర్షన్ లలో లభ్యమయ్యే ఈ కారు మ్యానువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్స్ లో లభ్యమవుతోంది.
ఇప్పటికే అభివృద్ధిచెందిన అమెరికా వంటి దేశాల్లో మంచి ఆదరణ పొందిన ఈ కారు భారతీయ మార్కెట్ లో కూడా తన హవాను కొనసాగిస్తుందని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఏడాది చివర్లో విడుదవుతుందని అనుకున్నా, అది కుదరకపోవడంతో ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చెయ్యాలని సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.