అమ్మకాల తగ్గుదలతో ధరల పెంపుపై మారుతి మొగ్గు

కాగా.. నవంబర్ నెలలో కూడా అమ్మకాలు క్షీణించడంతో వేరే ప్రత్యామ్నాయం లేక ధరలు పెంచాలని నిర్ణయించామని కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ మయాంక్ పారీక్ తెలిపారు. నవంబర్ 2011లో కంపెనీ అమ్మకాలు 18.46 శాతం క్షీణించి 91,772 యూనిట్లకు పడిపోయాయి. గడచిన సంవత్సరం ఇదే సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 1,12,554 యూనిట్లుగా ఉన్నట్లు ఎమ్ఎస్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశీయ అమ్మకాలు 19.15 శాతం క్షీణించి 82,870 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే కాలానికి ఇవి 1,02,503 యూనిట్లుగా ఉన్నాయి. మినీ-సగ్మెంట్ కార్లయిన ఎమ్800, ఏ-స్టార్, ఆల్టో, వ్యాగన్ ఆర్ మోడళ్ల అమ్మకాలు 27.24 శాతం తగ్గి 53,489 యూనిట్ల నుండి 38,921 యూనిట్లకు పడిపోయాయి.
అలాగే, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో (ఎస్టిలో, స్విఫ్ట్, రిట్జ్) అమ్మకాలు 23,014 యూనిట్ల నుండి 22,159 యూనిట్లకు పడిపోయి 3.72 శాతం క్షీణతను నమోదు చేశాయి. అయితే, సెడాన్ సెగ్మెంట్లో వస్తున్న డిజైర్ అమ్మకాలు మాత్రం 6.04 శాతం వృద్ధిని సాధించి 9,810 యూనిట్ల నుండి 10,403 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








