నవంబర్ నెలలో 53 శాతం పెరిగిన అశోక్ లేలాండ్ సేల్స్

గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 5,137 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్ 2011లో దేశీయ మార్కెట్లో అశోక్ లేలాండ్ అమ్మకాలు 66.72 శాతం వృద్ధిని సాధించి 6,477 యూనిట్లను విక్రయించగా, నవంబర్ 2010లో 3,885 యూనిట్లు విక్రయించింది. అలాగే, ఎగుమతులు కూడా 11.90 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 1,252 యూనిట్లకు పెరిగాయి. ఈ అమ్మకాలలో కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన దోస్త్ అమ్మకాలు 814 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








