మరో ఫ్రెంచ్ కార్ల కంపెనీ ఆకర్షించిన మోడి సర్కార్

Modi-Gujarat
నరేంద్ర మోడి సారధ్యంలో నడుస్తున్న గుజరాత్‌ సర్కారు వివిధ ఆటోమొబైల్ కంపెనీలను అయస్కాంతంలా ఆకట్టుకుంటుంది. సదరు సర్కారు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానలకు అన్ని కంపెనీలు జేజేలు పలుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ గడ్డపై కాలు మోపేందుకు మరో ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రీనాల్ట్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

గుజరాత్‌లో ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్యూజో తమ ప్లాంటు కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్, దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి కంపెనీలు గుజరాత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విధితమే.

వాస్తవానికి టాటా మోటార్స్ గుజరాత్‌లోని సనంద్‌లో ప్లాంటు ఏర్పాటు చేసినప్పుడే తాము కూడా గుజరాత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేకపోయింది. గుజరాత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు గానూ రీనాల్ట్ 400 ఎకరాల భూమి కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.

రానున్న మూడేళ్లలో గుజరాత్‌‌లో ఏటా 7.7 లక్షల కార్ల ఉత్పత్తి కాగలవని అంచనా వేస్తుండగా, రీనాల్ట్ కూడా ఇక్కడ ప్లాంటును ఏర్పాటు చేసినట్లయితే ఈ సంఖ్య 9.7 లక్షలకు పెరగవచ్చని అంచనా. వార్షికంగా రెండు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కలిగిన ప్లాంటును గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రీనాల్ట్ భావిస్తోంది.

గుజరాత్‌లో ఇప్పటికే అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్‌ మోటార్స్‌, దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Monday, December 5, 2011, 13:34 [IST]
English summary
French carmaker, Renault is planning to set up a manufacturing plant in Gujarat. According to sources, Renault is looking for 400 acres of land in the state.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+