ఇండియన్ టాప్‌గేర్ అవార్డులు దక్కించుకున్న మోడళ్లేంటి?

భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ కారు "స్విఫ్ట్" హ్యాచ్‌బ్యాక్ "స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డును సొంతం చేసుకుంది.
జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా అందిస్తున్న "ఆడి ఆర్ఎస్5" స్పోర్ట్స్ కార్ "కార్ ఆఫ్ ది ఇయర్ 2011" అవార్డును దక్కించుకుంది.
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న లేటెస్ట్ గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ500" రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఎస్‌యూవీ "బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ కార్ ఆఫ్ ది ఇయర్", "రీడర్స్ ఛాయిస్ కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను ఇది సొంతం చేసుకుంది.
ద్విచక్ర వాహన విభాగంలో జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ "హోండా సిబిఆర్ 250ఆర్ఆర్", "బైక్ ఆఫ్ ది ఇయర్" అవార్డును సొంతం చేసుకుంది.
అలాగే, ఇదే సెగ్మెంట్లో జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన ద్విచక్ర వాహన కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న సూపర్‌బైక్ "బిఎమ్‌డబ్ల్యూ 1200 జిఎస్", "సూపర్‌బైక్ ఆఫ్ ది ఇయర్" అవార్డును వశం చేసుకుంది.


Click it and Unblock the Notifications








