రెండేళ్లలో ప్యాసింజర్ వాహనాలు: నిస్సాన్-ఆశోక్ లేలాండ్
భారతదేశపు ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ, అశోక్ లేలాండ్, జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం త్వలోనే ప్యాసింజర్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలు చేతులు కలిపి ఓ తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సివి) "అశోక్ లేలాండ్ దోస్త్"ను దేశీయ విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి విజయవంతమై, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతుంది. దోస్త్ ఎల్‌సివి తయారీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిస్సాన్ అందిస్తుండగా, ఉత్పత్తికి కావలసిన యాంత్రిక మద్దతును అశోక్ లేలాండ్ అందిస్తుంది.
ఈ రెండు ఆటో దిగ్గజాల జాయింట్ వెంచర్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మరో రెండేళ్లలో ప్యాసింజర్ వాహనాలు కూడా మార్కెట్లోకి రానున్నాయి. అంతేకాకుండా, డీజిల్, సిఎన్‌జీ ఇంధనాలతో కూడా నడిచే మరిన్ని తేలికపాటి వాహనాలు కూడా వస్తాయని హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, నిస్సాన్ అశోక్ లేలాండ్ టెక్నాలజీస్ ఛైర్మన్ వి సుమంత్రన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








