నానో కోసం 300 ఎక్స్‌క్లూజి షోరూమ్స్: టాటా మోటార్స్
ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు టాటా నానో మునుపెన్నుడూ లేనివిధంగా నవంబర్ నెలలో 12 రెట్లు అమ్మకాలు నమోదు చేసుకోవడంతో టాటా మోటార్స్ మరోసారి ఈ మోడల్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కేవలం టాటా నానో కారు కోసం మాత్రమే ప్రత్యేకించి ఏర్పాటు చేయనున్న షోరూమ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింజది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాటా నానోకు 83 ప్రత్యేక షోరూమ్‌లు (ఎక్స్‌క్లూజివ్ షోరూమ్) ఉన్నాయి. 2012 మార్చి నాటికి వీటి సంఖ్యను 300 పెంచాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లలో కేవలం టాటా నానో కార్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. టాటా నానో కారును అప్‌గ్రేడ్ చేసి పాత ధరకే 2012 వెర్షన్‌ను కంపెనీ విడుదల చేయడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి.
గ్రామీణ ప్రాంతాలోని ప్రజలకు సైతం ఈ బుజ్జి కారును అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను టాటా మోటార్స్ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కేవలం ఎక్స్‌క్లూజివ్ టాటా నానో షోరూమ్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఈ బుజ్జి కారు కోసం టచ్ పాయింట్లను కూడా పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
గతంలో టాటా మోటార్స్ తమ చిన్న కారును విక్రయించేందుకు ప్రముఖ రీటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ సూపర్ మార్కెట్లను వేదికగా చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, టాటా గ్రూపుకు చెందిన రీటైల్ విభాగం టాటా వెస్ట్‌సైడ్ మాల్స్‌ను కూడా నానో సేల్స్ కోసం టచ్ పాయింట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. మరి కొత్తగా ఏర్పాటు కానున్న 300 షోరూమ్‌లు టాటా నానో అమ్మకాలు పెంచేందుకు సహకరిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








