14 నెలల్లో 1,00,000 ఇంజన్లను ఉత్పత్తి చేసిన ఫోర్డ్ ఇండియా

Ford Engine
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా చెన్నయ్‌లోని ఉత్పత్తి కేంద్రం నుంచి 1,00,000వ ఇంజన్‌ను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. జనవరి 2010లో ఈ ప్లాంటులో ఇంజన్‌ల ఉత్పత్తిని చేపట్టామని, కేవలం 14 నెలల్లోనే ఒక లక్ష ఇంజన్ల మైలురాయిని అధిగమించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. చెన్నయ్‌కు సమీపంలో ఉన్న మరైమలై నగర్‌ ఉత్పత్తి కేంద్రంలో ఫోర్డ్ వెచ్చించిన 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులలో భాగంగా ఈ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ప్లాంటును ఏటా 2,50,000 ఇంజన్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత వాహన మార్కెట్ మరియు ఎగుమతుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాంటును రూపొందించినట్లు ఫోర్డ్ ఇండియా పేర్కొంది. ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచ-స్థాయి ఉత్పత్తి కేంద్రం ద్వారా తమ నాణ్యమైన ఉత్పత్తులతో అన్ని విభాగాల్లోనూ గట్టి పోటీ ఇవ్వగలమని చెప్పారు. కాగా.. తర్వాతి లక్ష ఇంజన్లను ఇంత కన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేయగలమని ఫోర్డ్ ఇండియా వైస్-ప్రెసిడెంట్, పవర్‌ట్రైన్ ఆపరేషన్స్ (పిటిఓ) రాధాక్రిష్ణన్ బాలసుందరం చెప్పారు.

చెన్నయ్‌లో ఏర్పాటు చేసిన ఇంజన్ ప్లాంట్ ఫోర్డ్ తొలి ఉత్పత్తి కేంద్రం కావడం విశేషం. ఈ ప్లాంటులో పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లను ఫోర్డ్ ఉత్పత్తి చేస్తుంది. ఫోర్డ్ వాహనాల కోసం ఐదు రకాల డ్యురాటెక్ పెట్రోల్ ఇంజన్‌లను, ఒక డ్యురాటార్క్ డీజిల్ ఇంజన్‌ల కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంటులో ఉత్పత్తి చేసిన ఇంజన్‌లలో ఇప్పటి వరకూ మూడొంతులకు పైగా ఇంజన్‌లు దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్ దేశాలకు ఎగుమతి అయినట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, April 1, 2011, 15:43 [IST]
English summary
For Ford India, the potential of the Indian market is keenly precious by which the company delivered its 1,00,000th engine from its Chennai facility. The company created this feat after undergoing 14 months of intensive processing, from January 2010. The Chennai facility was the outcome of Ford’s erection at an investment of $500 million to yield the annual capacity of 2.5 lakh engines.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+