అద్భుతం: నవంబర్‌లో 6,401 నానో కార్ల అమ్మకాలు

అయితే, ప్రస్తుత టాటా నానో ధరలో ఏ మాత్రం మార్పు లేకుండా అదనపు హంగులతో, మరిన్ని ఫీచర్లను జోడించి సౌకర్యవంతంగా తీర్చిదిద్దిన సరికొత్త "2012 టాటా నానో" మంత్రం చక్కగా పనిచేసింది. నవంబర్ నెల చివరి వారంలో టాటా మోటార్స్ విడుదల సరికొత్త 2012 వెర్షన్ టాటా నానో కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
గడచిన సంవత్సరం నవబరం నెలలో కేవలం 509 టాటా నానో కార్లు మాత్రమే అమ్ముడైతే, ప్రస్తుత సంవత్సరం నవంబర్ నెలలో టాటా నానో అమ్మకాలు ఏకంగా, ఎవ్వరూ ఊహించినంతగా 6,401 యూనిట్లు అమ్మడయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. టాటా నానో అమ్మకాల జోరు చూస్తుంటే, ఈ మోడల్‌కు త్వరలోనే పునఃవైభవం రానుందని తెలుస్తోంది. ఏదైతేనేం.. నానోకు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం..!!


Click it and Unblock the Notifications








