భారత్‌కు వస్తున్న మిత్సుబిషి చిన్న కారు 'మిరేజ్'

తక్కువ ధర కలిగి ఉండేలా మిత్సుబిషి ఈ కారును రూపొందించింది. మిరేజ్ హ్యాచ్‌బ్యాక్ తొలుతగా థాయ్‌లాండ్ మార్కెట్లో అమ్మకం కానుంది. అనంతరం ఈ మోడల్ ఇండియా మార్కెట్లో కూడా విడుదల చేయాలని మిత్సుబిషి భావిస్తోంది.
మిత్సుబిషి గడచిన దశాబ్ధ కాలంగా భారత మార్కెట్లో అత్యంత పురాతన ఆటోమొబైల్ సంస్థ అయిన హిందుస్థాన్ మోటార్స్‌తో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ దేశీయ మార్కెట్లో పెద్దగా మార్కెట్ వాటాను దక్కించుకోలేకపోయింది.
ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో తక్కువగా ఉండి, ఉన్న మోడళ్ల ధరలు కూడా అధికంగా ఉండటమే. ఏదేమైనప్పటికీ, మిత్సుబిషి భారత మార్కెట్లో అందిస్తున్న సెడాన్ లాన్సర్ మాత్రం మంచి మార్కెట్ వాటాను సంపాధించుకుంది.
ఇవి కాకుండా, సెడియా సెడాన్, పాజెరో, మోంటెరో, అవుట్‌లాండర్ ఎస్‌యూవీలను మిత్సుబిషి దేశీయ విపణిలో అందిస్తుంది. మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే, కంపెనీ నుండి లభిస్తున్న చిన్న మరియు చౌక కారుగా ఇది నిలువనుంది.
ఇది రెండు ఇంజన్ వేరియంట్లలో (1 లీటర్, 1.2 లీటర్) లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన వేరియంట్ కూడా లభించే అవకాశం ఉంది. మైలేజ్‌ను పెంచేందుకోసం ఇందులో ఆటో స్టార్ట్, ఆటో స్టాప్ ఆప్షన్ కూడా ఉండనుంది.


Click it and Unblock the Notifications








