జనవరి 1 నుండి ధరలు 3% ధరలు పెంచనున్న టొయోటా

పెరిగిన ధరలు జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. గడచిన మూడు నెలలుగా కరెన్సీ ఒడిదుడుకుల వత్తిడిని తాము గమనిస్తున్నామని, ఇప్పుడు కొంత భారాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించామని, జనవరి 1 నుండి ఉత్పత్తుల ధరలను 1.25-3 శాతం మేర పెంచనున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు.
ప్రస్తుతం టొయోటా లివా హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.3.99 లక్షల నుండి 5.99 లక్షల మధ్యన ఉండా, ఎతియోస్ సెడాన్ ధరలు రూ.4.99 లక్షల నుండి 7.87 లక్షల మధ్యలోనూ, కరోలా ఆల్టిస్ ధరలు రూ.10.63 లక్షల నుండి రూ.14.75 లక్షల మధ్య ఉన్నాయి. టొయోటా ఫార్చ్యూనర్ ధర రూ.22.45 లక్షలుగా ఉండగా, ఇన్నోవా ధరలు రూ.8.48 లక్షల నుండి రూ.12.81 లక్షల మధ్యలో ఉన్నాయి.
అయితే, ప్రస్తుతానికి ఏ మోడల్‌పై ఎంత మేర ధరను పెంచాలో నిర్ణయించలేదని, మోడల్‌ను ఈ ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందనని, కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ధర రూ.50,000 మేర పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








