మహీంద్రా స్కార్పియో, జైలో, వెంటోలపై భారీ డిస్కౌంట్స్!
ఇయరెండ్, స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా వివిధ ఆటోమొబైల్ కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) వంతు వచ్చింది. ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న వివిధ మోడళ్లపై రూ.35,000 మొదలుకొని రూ.60,000 వరకూ తగ్గింపులను అందిస్తుంది.
మహీంద్రా జైలోపై రూ.60,000 డిస్కౌంట్:
మహీంద్రా జైలో ఎస్‌యూవీ/ఎమ్‌పివిలోని అన్ని వేరియంట్లు (డి2, ఈ4, ఈ6, ఈ8) రూ.60,000 విలువైన ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా, మహీంద్రా జైలో కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.15,000 విలువైన ఇతర ఫైనాన్షియల్ బెనిఫిట్లను పొందవచ్చు.
మహీంద్రా స్కార్పియోపై రూ.40,000 డిస్కౌంట్:
మహీంద్రా అండ్ మహీంద్రా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) స్కార్పియోపై కూడా కంపెనీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. స్కార్పియోలో లభిస్తున్న టాప్ ఎండ్ వేరియంట్ విఎల్ఎక్స్ కొనుగోలుపై రూ.40,000 ప్రయోజనాలను కొనుగోలుదారులు పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా, రూ.21,500 క్యాష్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన ఎక్సేంజ్ బోనస్, రూ.6,500 విలువైన ఇన్సూరెన్స్ మరియు రూ.7,000 విలువైన ఇతర ఫైనాన్షియల్ బెనిఫిట్లను పొందవచ్చు.
మహీంద్రా వెరిటోపై రూ.35,000 డిస్కౌంట్:
ఎమ్ అండ్ అందిస్తున్న ఒకే ఒక్క సెడాన్ 'వెరిటో'పై రూ.35,000 విలువైన ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా, మహీంద్రా వెరిటో సెడాన్ (జి4 పెట్రోల్ వేరియంట్) కొనుగోలుదారులు రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన ఎక్సేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అలాగే డి2 డీజిల్ వేరియంట్ వెరిటో కొనుగోలుదారులు 18,500 క్యాష్ డిస్కౌంట్‌ను, వెరిటో డి4 డీజిల్ వేరియంట్ కొనుగోలుదారులు రూ.21,500 క్యాష్ డిస్కౌంట్‌ను మరియు టాప్-ఎండ్ వేరియంట్ వెరిటో డి6 కొనుగోలుదారులు రూ.28,000 క్యాష్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఈ ఆఫర్లు డిసెంబర్ 5, 2011 నుండి డిసెంబర్ 25, 2011 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ సమీపంలోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లి మీ డ్రీమ్ కారును బుక్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








