బ్రేకింగ్ న్యూస్: నిస్సాన్ సన్నీ డీజిల్ వేరియంట్ విడుదల
మీరు నిస్సాన్ సన్నీ డీజిల్ వేరియంట్ కోసం వేచి చూస్తున్నారా..? అయితే, ఇది మీకు బ్రేకింగ్ న్యూసే. ఎందుకంటే, నిస్సాన్ మోటార్ ఇండియా ప్రై లి దేశీయ విపణిలో ఇటీవలే ప్రవేశపెట్టిన సెడాన్ కారు "నిస్సాన్ సన్నీ" ఓ డీజిల్ వేరియంట్‌ను కంపెనీ నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాదండోయ్, నిస్సాన్ డీజిల్ వేరియంట్ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని నిస్సాన్ సన్నీ చిత్రాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
నిస్సాన్ మైక్రాను రూపొందించిన పాపులర్ గ్లోబల్ 'వీ' ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే నిస్సాన్ సన్నీ డీజిల్ వేరియంట్‌ను కంపెనీ రూపొందించింది. అటు శక్తి (పవర్) లోనూ ఇటు ఇంధన సామర్థ్యం (మైలేజ్)లోనూ బెస్ట్-ఇన్-క్లాస్ అనింపిచేలా నిస్సాన్ ఈ డీజిల్ వేరియంట్ సన్నీసెడాన్‌ను తీర్చిదిద్దింది. రెండు వేరియంట్లలో లభించే నిస్సాన్ సన్నీ సెడాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ - రూ.7,98,000
* నిస్సాన్ సన్నీ ఎక్స్‌వీ - రూ.8,78,000
దేశవ్యాప్తంగా ఉన్న 47 నిస్సాన్ డీలర్‌షిప్ కేంద్రాలలో సన్నీ డీజిల్ లభ్యం కానుంది. నిస్సాన్ సన్నీ డీజిల్ వేరియంట్‌లో ఉపయోగించిన కె9కె (K9K) డీజిల్ ఇంజన్ రీనాల్ట్-నిస్సాన్ అలయన్స్ నుండి తయారైనది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరు డీజిల్‌కు 21.64 కి.మీ. మైలేజీనిస్తుంది. సన్నీ డీజిల్‌లో అమర్చిన మోడ్రన్ 1.5-లీటర్, 4-సిలిండర్ కె9కె ఇంజన్ 3750 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








