కాంపాక్ట్ స్విఫ్ట్ సెడాన్‌ విడుదలకు ముహుర్తం ఖరారు!

Swift Dzire
మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్ కూడా ఒకటి. ప్రస్తుతానికి రెండు రూపాల్లో లభ్యమవుతున్న (స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్) మారుతి సుజుకి స్విఫ్ట్ త్వరలోనే మరో రూపంలో దర్శనమివ్వనుంది. భారత మార్కెట్లోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో సైతం ఉత్తమ ప్రజాదరణ పొందుతున్న స్విఫ్ట్ కారు మరో కాంపాక్ట్ సెడాన్ ప్రవేశ పెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ నుండి రాబోతున్న ఈ బుజ్జి స్విఫ్ట్ సెడాన్ పరిమాణంలో, ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కన్నా చిన్నగా ఉండనుంది. స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మొత్తం పొడవు 4.16 మీటర్లు (4160 మి.మీ.)గా ఉంది. కాగా.. కొత్త మారుతి సుజుకి అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ స్విఫ్ట్ సెడాన్ మొత్తం పొడవు కేవలం 3.99 మీటర్లు (3990 మి.మీ.)గా ఉండనుంది.

అందుకే ఈ కారుకు "స్విఫ్ట్ 3.99" అనే కోడ్‌తో రూపొందుతుంది. ఇప్పటికే ఈ కారను కంపెనీ ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ సెడాన్ దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. సాధారణంగా నాలుగు మీటర్ల (సబ్ 4-మీటర్) కన్నా తక్కువగా ఉండే కార్లను ప్రభుత్వం చిన్న కార్లుగా పరిగణించి వాటిపై ఎక్సైజ్ సుంఖంలో రాయితీని ఇవ్వడం జరుగుతుంది.

ఇలా ఎక్సైజ్ సుంఖంలో రాయితీలను పొందేందుకు గానూ నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండేలా ఓ సరికొత్త కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ కారును మారుతి సుజుకి అభివృద్ధి చేస్తుంది. వచ్చే జనవరిలో న్యూఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2012లో కంపెనీ ఈ కారును ప్రదర్శించే అవకాశం ఉంది. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ కాంపాక్ట్ సెడాన్ ధర నాలుగు లక్షలకు ఎగువన ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, December 13, 2011, 18:42 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India is developing a sub four meter compact Swift sedan called with code name of "Swift 3.99" and it will be showcased at upcoming Delhi Auto Expo 2012. This compact sedan expected to launched in Q1 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+