కేవలం రూ.6 లక్షలకే శాన్ స్టోర్మ్‌ కన్వర్టబిల్ కార్

కార్ బ్రీడ్‌లో కన్వర్టబిల్ కార్లకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కార్లలో ప్రయాణించే వారు సూర్యరశ్మిని, ప్రకృతి సిద్ధమైన గాలిని ఆస్వాధించేలా వీటిని రూపొందించబడ్డాయి. అంతేకాకుండా, ఇవి స్పోర్టీ లుక్‌ను కూడా కలిగి ఉంటాయి. అమెరికన్లు, యూరోపియన్లు ఎక్కువగా ఇలాంటి కార్లను ఇష్టపడుతుంటారు. అందుకే పెద్ద పెద్ద లగ్జరీ కార్ కంపెనీల నుండి చిన్న సైజు ఆటో దిగ్గజాల వరకూ ఈ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని కన్వర్టబిల్ కార్లను రూపొందిస్తుంటారు.

అయితే, భారత్‌లో పరిస్థితి వేరు. అమెరికా, యూరప్‌లలో దాదాపు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, కన్వర్టబిల్ కార్లకు అక్కడ మంచి ఆదరణ ఉంటుంది. కానీ మన దేశంలో ఎక్కువగా వేడి వాతావరణంతో కూడుకున్నది కాబట్టి ఈ కార్ల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, భారత మార్కెట్లో కన్వర్టబిల్ కార్ల ధరలు కూడా కాస్తంత ప్రియంగానే ఉండటంతో, ఇక్కడ వీటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది.

సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, గోవాకు చెందిన "శాన్ మోటార్స్" భారత్‌లో కన్వర్టబిల్ కార్లను తయారు చేస్తున్న ఏకైక స్థానిక ఆటోమొబైల్ కంపెనీ. శాన్ మోటార్స్ చాలా చిన్న కంపెనీ. ఇది కేవలం నెలకు రెండు నుంచి మూడు కన్వర్టబిల్ కార్లను మాత్రమే తయారు చేస్తుంది. ఈ కంపెనీ అందిస్తున్న కన్వర్టబిల్ కారు పేరు "శాన్ స్టోర్మ్‌". ఇదొక సాఫ్ట్ టాప్ రూఫ్‌తో కూడిన 2-సీటర్ కారు. అవసరం లేదనుకున్నప్పుడు రూఫ్‌ను తొలగించి కన్వర్టబిల్ కారుగా మార్చుకోవచ్చు.

ప్రస్తుతం శాన్ స్టోర్మ్‌ కన్వర్టబిల్ కారులో రీనాల్ట్ నుండి పొందిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, త్వరలోనే ఈ కారులో రీనాల్ట్ కంపెనీ నుండి 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కొనుగోలు చేసి ఉపయోగించనున్నారు. ఈ కారు తయారీలో ఉపయోగించే బాడీ ప్యానెల్స్‌ బెంగుళూరులో తయారవుతాయి. ఇలా సేకరించిన విడిభాగాలను శాన్ మోటార్స్ గోవాలోని అసెంబ్లింగ్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తుంది.

ప్రస్తుతానికి శాన్ స్టోర్మ్‌ కన్వర్టబిల్ కార్లు గోవాలో మాత్రమే అమ్ముడవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇది ఈ కన్వర్టబిల్ కారు ధర విషయానికి వస్తే ఓ లగ్జరీ కన్వర్టబిల్ కారు ధర కన్నా దాదాపు 10 రెట్లు తక్కువ. అంటే, దీని రూ.6 లక్షల లోపే ఉంటుందన్నమాట. మరి 60 లక్షలు వెచ్చించి ఫారిన్ కన్వర్టబిల్ కార్లను కొనుగోలు చేయలేని జస్ట్ రూ.6 లక్షలు చెల్లించి శాన్ స్టోర్మ్‌లో సూపర్ డ్రైవ్ అనుభూతిని పొందవచ్చు. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Tuesday, December 13, 2011, 15:01 [IST]
English summary
Convertible cars are a special breed of cars. They are designed, engineered and built with the sole objective of allowing the driver to enjoy the sun and wind. Convertibles have been loved by European and Americans the most bit they do not have found favour in India. However we cannot say we do not have our own convertible car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+