జస్ట్ రూ.6.99 లక్షలకే సరికొత్త హోండా సిటీ సెడాన్

ప్రస్తుతం హోండా విడుదల చేసిన "2012 హోండా సిటీ" ఆరవ తరానికి (సిక్స్త్ జనరేషన్) చెందినది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, 2012 హోండా సిటీ సెడాన్ ధర. దీని ప్రారంభ వేరియంట్ ధర కేవలం రూ.6.99 లక్షలు మాత్రమే. ఇందులో 1.5 లీటర్ సామర్థ్యం కలిగిన, శక్తివంతమైన ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 118 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది.
మైలేజ్ విషయంలో కూడా 2012 హోండా సిటీ సెడాన్ ది బెస్ట్ అనిపించుకోనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, సరికొత్త హోండా సిటీ సెడాన్ లీటర్ పెట్రోల్‌కు 16.8 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది కార్పోరేట్, ఈ, ఎస్, వీ అనే నాలుగు ట్రిమ్ వెర్షన్లలో లభ్యమవుతుంది. వీ ట్రిమ్ వెర్షన్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, సన్‌రూఫ్ ఆప్షన్‌తో కూడా లభ్యమవుతుంది.
ఇంకా ఇందులో బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, జి-కాన్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. కొన్ని ఎంపిక చేసిన మోడళ్ల క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కార్నెలియన్ రెడ్ పెరల్, స్పార్క్లింగ్ బ్రౌన్ మెటాలిక్, అర్బన్ టైటానియం మెటాలిక్, బోల్డ్ బీజ్ మెటాలిక్, అల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్, టెఫ్ఫెటా వైట్ అనే ఆరు ఆకర్షనీమైన రంగుల్లో లభ్యమవుతుంది.
సరికొత్త 2012 హోండా సీటీ సెడాన్ వేరియంట్ల వారీ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* 2012 హోండా సిటీ కార్పోరేట్ - రూ.6.99 లక్షలు
* 2012 హోండా సిటీ ఈ - రూ.7.70 లక్షలు
* 2012 హోండా సిటీ ఎస్ - రూ.8.20 లక్షలు
* 2012 హోండా సిటీ వీ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ - రూ.8.70 లక్షలు
* 2012 హోండా సిటీ వీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ - రూ.9.42 లక్షలు
* 2012 హోండా సిటీ వీ (సన్‌రూఫ్) మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ - రూ.9.50 లక్షలు
* 2012 హోండా సిటీ వీ (సన్‌రూఫ్) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ - రూ.10.22 లక్షలు


Click it and Unblock the Notifications








