రూ.17.99 లక్షల ధరకే నిస్సాన్ టియానా సెడాన్!!

Nissan Teana
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ భారత మార్కెట్లో సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్లో అందిస్తున్న ప్రీమియం సెడాన్ టియానా ఇప్పుడు ప్రత్యేక ధరలో లభ్యమవుతుంది. ఎంపిక చేసిన నిస్సాన్ డీలర్‌షిప్ కేంద్రాలలో నిస్సాన్ టియానా లగ్జరీ సెడాన్ కారు కేవలం రూ.17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకే లభిస్తుంది.

భారత్‌లో నిస్సాన్ టియానా విడుదలైనప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. దీని అధిక ధరే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో టియానా సెడాన్ కారును తగ్గింపు ధరకే అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే సెగ్మెంట్లో మారుతి సుజుకి అందిస్తున్న కిజాషి ప్రీమియం సెడాన్‌కు నిస్సాన్ టియానా సెడాన్‌ పోటీ ఇవ్వనుంది.

అయితే, కిజాషి అమ్ముడవుతున్నంత అధికంగా టియానా అమ్ముడు కావడం లేదు. నిస్సాన్ ఈ మోడల్‌నే కాకుండా, ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ, 370జెడ్ స్పోర్ట్స్ కార్లను కూడా సిబియూ రూట్లో దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది. నిస్సాన్ టియా సెడాన్ విషయానికి వస్తే, ఇందులో 2.5 లీటర్ వీ-6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 182 కి.వా. శక్తిని, 228 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఇందులో ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) సిస్టమ్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), బ్రేక్ అసిస్టెన్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్ డైనమిక్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ప్రీమియం లెథర్ సీట్లు, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడైనా నిస్సాన్ టియానా అమ్మకాలు జోరుగా సాగుతాయో లేదో వేచిచూడాల్సిందే...!!

More from DriveSpark

Article Published On: Friday, December 16, 2011, 17:20 [IST]
English summary
Reports says that, Japanese carmakers Nissan's premium sedan Nissan Teana now available at a special price of Rs 17.99 lakh ex-showroom.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+