సరికొత్త ప్రయస్ కారును విడుదల చేయనున్న టొయోటా

Toyota Prius 2012
జపాన్ ఆటో దిగ్గజం టొయోటా భారత మార్కెట్లో అందిస్తున్న హైబ్రిడ్ కారు ప్రయస్‌లో సరికొత్త అప్‌గ్రేడెడ్ వేరియంట్ వేరియంట్‌ను వచ్చే జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో విడుదల చేయనుంది. ప్రస్తుతం శిలాజ ఇంధనాల (డీజిల్, పెట్రోల్, గ్యాస్ మొదలైనవి) వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి హైబ్రిడ్ కార్ల వినియోగం మనకు ఎంతైనా అవసరం ఉంది.

ప్రయస్ హైబ్రిడ్ కారు టొయోటా నుండి అత్యధికంగా అమ్మడవుతున్న మోడల్. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మడవుతున్న హైబ్రిడ్ కారు కూడా. ఇది కేవలం హైబ్రిడ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందుకు కారణం ఇందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానమే. 2015 నాటికి పది సరికొత్త హైబ్రిడ్ కార్లను విడుదల చేయాలని టొయోటా సన్నాహాలు చేస్తుంది.

సరికొత్త 2012 టొయోటా ప్రయస్‌లో ఉండనున్న ఫీచర్లు:
- సరికొత్త ఫ్రంట్ బంపర్
- సరికొత్త, పెద్ద ఫ్రంట్ గ్రిల్
- స్పష్టమైన లెన్స్, ఎల్ఈడి లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్స్
- బంపర్‌పై డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి ల్యాంప్స్
- ఎలక్ట్రిక్ ఓవిఆర్ఎమ్‌లు (అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్)
- రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్
- సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ (ఆప్షనల్)

అంతేకాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇంటిరీయర్స్ కూడా ఇందులో మరో ప్రధాన ఆకర్షనగా నిలువనున్నాయి. బ్లూకలర్ లైట్‌తో కూడిన స్టార్ట్ బటన్, మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్, అక్కడక్కడా సిల్వర్ కలర్‌తో కూడిన బ్లాక్ ఇంటీరియర్స్, బ్లూటూత్ కనెక్టివీ, రియర్ వ్యూ కెమెరా, ఐప్యాడ్ కనెక్టివిటీ వంటి ఎన్నో ఆసక్తికరమైన ఫీచర్లు సరికొత్త 2012 ప్రయస్ సొంతం.

ఇది 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌పై 14.3 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది కేవలం 10.7 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. టొయోటా ప్రయస్ గరిష్ట వేగం గంటకు 180 కి.మీ.

More from DriveSpark

Article Published On: Friday, December 16, 2011, 16:54 [IST]
English summary
One of the world’s best selling hybrid car Toyota Prius will get few alterations. The New face-lifted 2012 Toyota Prius is all set to launch on upcoming Delhi Auto Expo 2012. Toyota also planning to introduce ten more new hybrid cars by the year 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+