ఆటో ఎక్స్‌పోలో ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి రోడ్‌స్టర్ విడుదల

"ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో మా వాహనాల ప్రదర్శన, ప్రజెంటేషన్ రెండూ కూడా ఆకట్టుకోనున్నాయి. స్టన్నింగ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి రోడ్‌స్టర్ మోడల్‌తో పాటు అనేక మోడళ్లు ఇక్కడ కొలువుదీరనున్నాయ"ని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ హానెగ్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత ఖరీదైన డిజైన్, టెక్నాలజీతో కూడుకున్న ఏ-క్లాస్ కాన్సెప్ట్‌ను కంపెనీ విడుదల చేయనుంది.
ఈ ఆటో ఎక్స్‌పోలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ జిటి3, డిటిఎమ్‌లతో పాటుగా 10 కు పైగానే మోడళ్లు దర్శనమివ్వనున్నాయి. ఇదిలా ఉండగా, జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్‌తో కలిసి మెర్సిడెస్ బెంజ్ వచ్చే ఏప్రిల్ నాటికి ఓ డ్రైవింగ్ అకాడెమీని నెలకొల్పనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, ఈ అకాడెమీలో చేరాలనుకునే అభ్యర్థుల వివరాలను ఆటో ఎక్స్‌పోలో నమోదు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








